NewsNews AlertTelangana

కేసీఆర్ అవినీతి పై షర్మిల మరో ట్విట్..

Share with

వైఎస్ షర్మిల ఈ మధ్య కేసీఆర్‌ను తిట్టడమే లక్షంగా పెట్టుకున్నట్టున్నారు. గత కొద్ది రోజులుగా ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌పై ప్రశ్నల తూటాలు విసురుతున్నారు. ఈ రోజు కూడా ఆమె కేసీఆర్ పై  చేసిన ట్విట్ వైరల్‌గా మారింది. కేసీఆర్ అవినీతి తారా స్ధాయికి చేరిందన్న ఆమె  ఈ రకంగా ట్వీట్ చేశారు  “ మాయల ఫకీర్ ప్రాణం చిసుకలో ఉన్నట్టు.. కేసీఆర్ అవినీతి సొమ్మంతా మేఘా కృష్ణారెడ్డి చేతుల్లో ఉందన్నారు”. అందుకే మేఘా కంపెనీ నిర్మించిన పంపు హౌస్‌లు మునిగినా , దొర పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో కార్మికుల ప్రాణాలు తీసినా పంప్ హౌస్ ఘటన కాని , అదే విధంగా గుట్టలు కొల్లగొట్టి మట్టిని ఇసుకను పక్క రాష్ట్రానికి చేరుస్తున్న దొరకు ఏ మాత్రం కానరాదన్నారు. రూల్స్‌కి విరిద్దంగా చేసిన బ్లాస్టింగ్‌ల వల్లే పంపు హౌస్ ‌లు మునిగినా  నిమ్మకు నిరేక్కి నట్టు ఉన్నారన్నారు.

అవి తన కమిషన్లు పెంచుకునేందుకు ఉపయోగించుకుంటారు తప్ప మేఘా కృష్ణారెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి పనికిరావా అంటూ ప్రశ్నించారు. దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు , కాంట్రాక్టులన్నీ సద్ది కట్టినట్టు మేఘా కృష్ణారెడ్డికి  అప్పగించారన్నారు. మేఘా తీగ లాగితే తన అవినీతి డొంక ఎక్కడ కదులుతుందోననే భయంతో  మేఘా మీద ఈగ వాలకుండా కేసీఆర్ కాపలా కాస్తున్నారని విమర్శించారు.