ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ కీలక నిర్ణయం
మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకూ మహారాష్ట్రలో 45 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేటి సాయంత్రం జరిగే ఎగ్జిట్ పోల్స్ చర్చలలో పాల్గొనడం లేదంటూ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు మహారాష్ట్రలో ఒకే విడతలో ఈ పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖ సినీ, క్రీడా, రాజకీయనాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబయిలోని 113 ఏళ్ల వయో వృద్ధురాలు కాంచన్ బెన్ ఓటుహక్కును వినియోగించుకోవడం స్పూర్తిని నింపింది.

