NationalNews

కాంగ్రెస్‌లో రేవంత్ కల్లోలం

Share with

కాంగ్రెస్‌లో ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి పడుతున్నట్టు కన్పిస్తోంది. రాహుల్ గాంధీ హెచ్చరించినా సీనియర్లు మాత్రం తగ్గడం లేదు. పార్టీలో గ్రూపులుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. వర్గవిభేదాలు మరింత తీవ్రమవుతున్నాయ్. రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు పార్టీకి చేటు చేస్తాయని నేతలు మండిపడుతున్నారు. ఉత్తర తెలంగాణలో ప్రతీ చేరిక తమకు తెలిసే జరగాలని నేతలు చెబుతున్నా.. రేవంత్ తన పని తాను చేసుకుపోతున్నాడని నేతలు ఫీలవుతున్నారు. రేవంత్ తీరుతో ఆయన ప్రత్యర్థులందరూ… ఏకమవుతున్నారు.

సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, మధు యాష్కీగౌడ్, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ … మరికొందరు నేతలు.. రేవంత్ వ్యతిరేక వర్గంగా పనిచేస్తున్నారు. రేవంత్ పార్టీ లైన్లో కాకుండా.. వ్యక్తిగత ఎజెండాతో అడుగులు వేస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని… తెలంగాణ తెలుగుదేశం లాగా మార్చేస్తున్నాడని నేతలు విమర్శిస్తున్నారు. రేవంత్ తీరు మార్చుకోవాలని.. లేకుంటే మీ ఇష్టమని.. పార్టీ హైకమాండ్ కు తేల్చి చెప్పాలని నేతలు భావిస్తున్నారు.