హైదరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ
హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ యూత్ వింగ్‌లు ఆందోళనలు చేస్తున్నాయి. హిందుత్వంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ యువమోర్చా ఆందోళనలు చేపట్టగా, రాహుల్ గాంధీపై మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యాలయ ముట్టడికి పాల్పడ్డారు యూత్ కాంగ్రెస్ నేతలు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి గాంధీభవన్ ముట్టడికి బయలుదేరిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు బీజేపీ కార్యకర్తలు. వీరికి పోటీగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళనలు చేపట్టింది. రాహుల్ గాంధీపై మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు కాంగ్రెస్ యూత్. దీనితో గాంధీభవన్ ఎదుట బారికేడ్లు పెట్టి వారిని అడ్డుకున్నారు పోలీసులు. ఇరువర్గాలను పోలీసులు నచ్చజెప్పడానికి ప్రయత్నించి అక్కడ నుండి పంపించారు.

