పూరైన చంద్రగ్రహణం
ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. చంద్రుడు ఎరుపెక్కాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో గంటపాటు గ్రహణం ఏర్పడగా… మన దగ్గర 39 నిమిషాలు కొనసాగింది. అత్యధికంగా గౌహతిలో 1:01:43 గంటల పాటు గ్రహణం కనిపించింది. బ్లడ్ మూన్ అంటే చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఇక సూర్యగ్రహణం చూసేందుకు అయితే ప్రత్యేక పరికరాలు అవసరం కానీ చంద్రగ్రహణాన్ని నేరుగా చూడొచ్చని సైంటిస్టులు చెప్పారు. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూమి నీడ పడినప్పుడు సూర్యుడి నుంచి వచ్చే కాంతి తరంగాలు ఫిల్టర్ అవుతాయి. దీంతో చంద్రుడు ఎరుపు, నారింజ వర్ణంలో కనిపిస్తాడు. దీన్నే బ్లడ్ మూన్ అంటారు. అయితే… ఈ ఏడాదికి ఇదే చివరి చంద్రగ్రహణం. మళ్లీ చంద్ర్రగ్రహణం సెప్టెంబర్ 7, 2025లోనే కనిపించనుంది. పాక్షిక చంద్రగ్రహణం మాత్రం 2023 అక్టోబర్‌లో కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

