NationalNews

మోదీని ఢీకొట్టడానికి ఢిల్లీ వస్తున్నా-కేసీఆర్

Share with

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా జరిగిన కార్యక్రమంలో… ప్రధాని మోదీపై ఉన్న అక్కసును మరోసారి బయటపెట్టుకున్నారు సీఎం కేసీఆర్… సంబంధం లేని విషయాల గురించి మాట్లాడుతూ… మోదీని టార్గెట్ చేశారు. ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా?… ఏ ఒక్క వర్గానికైనా మోదీ న్యాయం చేశారా అంటూ ప్రశ్నించిన కేసీఆర్… ప్రసంగమంతా బీజేపీ పాలన విమర్శలకే పరిమితం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలిన చేసుకొని యశ్వంత్ సిన్హాకు ఓటేయాలన్నారు. ఇద్దరు ప్రెసిడెంట్ అభ్యర్థుల పనితీరు, తేడా గమనించాలన్నారు కేసీఆర్. వ్యక్తిగతంగా మోడీతో విభేదాల్లేవంటూనే విమర్శలుగుప్పించారు కేసీఆర్. మేకిన్ ఇండియా వల్ల దేశానికి వచ్చిన లాభం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. పక్కనే ఉన్న చైనా జీడీపీ… ఇండియా జీడీపీ ఎలా ఉందో చూడాలన్నారు. నరేంద్రమోదీ రైతు చట్టాలను ఎందుకు వెనక్కి తీసుకున్నారో చెప్పాలన్నారు. 13 నెలలు ఆందోళనలో 700 మంది రైతులు చనిపోయారని… విశాల దృక్పథంతో రైతులకు టీఆర్ఎస్ సర్కారు 3 లక్షల సాయమందించిందన్నారు కేసీఆర్. పాలన చేయరాకపోతే దిగిపోవాలన్నారు కేసీఆర్. మోడీ పాలనలో 8 ప్రభుత్వాలను కూల్చిందని… 150 కోట్ల ప్రజల జీవితాలతో మోడీ జోకులు వేస్తున్నారంటూ దుయ్యబట్టారు కేసీఆర్… తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లలో ఫ్రెండ్లీ పార్టీ కలిసి 95 సీట్లు గెలిచామన్నారు. ఢిల్లీ కోటను ఢీకొట్టేందుకు జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నామన్నారు కేసీఆర్.