Home Page SliderInternational

అమెరికాలో కుప్పకూలిన బ్రిడ్జ్..!

వాషింగ్టన్: అమెరికా మేరీల్యాండ్ నగరంలోని ఓ వంతెన కుప్పకూలింది. మంగళవారం తెల్లవారుజామున బాల్టిమోర్ పట్టణంలోని పాలప్స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను సింగపూర్ జెండా ఉన్న ఓ కంటైనర్ షిప్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వంతెన కూలిపోవడంతో సుమారు 20 మంది నదిలో పడిపోయారని బాల్టిమోర్ పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి.