Home Page SliderTelangana

తెలంగాణ అభివృద్ధిలో కోకోకోలా భాగస్వామ్యం

తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ప్రముఖ కూల్‌ డ్రింక్స్‌ తయారీ కంపెనీ హిందుస్థాన్ కోకా కోలా బెవెరేజెస్ (HCCB) ముందుకొచ్చింది. అటవీ & పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తో కంపెనీ ప్రతినిధుల బృందం మంగళవారం భేటీ అయ్యింది. నీరు ఘన వ్యర్థాల నిర్వహణలో సామర్థ్యం పెంపు, వ్యర్థ జలాల పునర్వినియోగం, యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని, ఉద్యోగ అవకాశాలలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రికి సంస్థ ప్రతినిధులు చెప్పారు. కోకోకోలా రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు రూ. 3వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టిందని మంత్రికి కోకోకోలా ప్రతినిధులు చెప్పారు.

సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌లో గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది, రాష్ట్రంలో పెట్టుబడులతో పాటు సామాజిక అభివృద్ధిలో తమ కంపెనీ భాగస్వామ్యమవుతుందని, అందుకు తగిన విధంగా ప్రాజెక్టులను విస్తరిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా లోని మారుమూల గ్రామాల్లో త్రాగు నీరు ట్యాంక్ లు, స్కూల్స్ లో మొబైల్ టాయిలెట్స్, అంగడి వాడి బిల్డింగ్స్ కటించి.. waste management మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం అని మంత్రికి ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో కోకోకోలా బెవరేజేస్ పబ్లిక్ అఫైర్స్ చీప్ హిమన్సు, క్లస్టర్ హేడ్ ముకుందు త్రివేది, బాపూయే , OSD సుమంత్, తదితరులు పాల్గొన్నారు.