బీఏసీ సమావేశంలో సీఎం కీలక వ్యాఖ్యలు
ఏపీ బీఏసీ సమావేశంలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకి జగన్ ఆఫర్ ఇచ్చారు. మీరు ఏం అంశం కావాలన్న చర్చకు మేం రెడీగా ఉన్నామన్నారు. మీరు కోరే ప్రతీ అంశంపైనా చర్చిస్తామన్నారు. ఈఎస్‌ఐ స్కాంపైనా చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నామని జగన్ తెలిపారు. కానీ సభ నిర్వహణను మాత్రం అడ్డుకోవద్దని అచ్చెన్నాయుడితో సీఎం జగన్ చెప్పినట్లు సమాచారం. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని సభ్యులు నిర్ణయించారు.


 
							 
							