Andhra PradeshHome Page Slider

రుషికొండపై సీఎం హెలికాప్టర్ చక్కర్లు

విశాఖపట్టణం (సాగర్‌నగర్): విశాఖలో సోమవారం ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుగు ప్రయాణంలో రుషికొండ వైపు వచ్చి వెళ్లడం చర్చనీయాంశమైంది. జగన్ తొలుత విశాఖ విమానాశ్రయం నుంచి మధురవాడ ఐటీ హిల్‌కు హెలికాప్టర్‌లో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్ అదేమార్గంలో కాకుండా రుషికొండ వైపు వచ్చి వెళ్లింది. హెలికాప్టర్ కొండవైపుగా వచ్చి, కొన్ని క్షణాలపాటు చక్కర్లు కొట్టిందని స్థానికులు చెబుతున్నారు. రుషికొండపై పర్యాటక ప్రాజెక్టు పేరుతో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంపు ఆఫీస్ కోసమేనంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.