సీప్లేన్ ప్రారంభించిన సీఎం
విజయవాడలో సీప్లేన్‌ను ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులు జ్యోతి ప్రజ్వలనం చేసి లాంఛనంగా కార్యక్రమం ప్రారంభించారు. ఏపీలో త్వరలో సీప్లేన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. టూరిజం శాఖ ఈ సీప్లేన్లను నిర్వహించనుంది. విజయవాడ నుండి శ్రీశైలానికి ఈ సేవలు మొదలుకాబోతున్నాయి. 14 మంది ఒక్కసారిగా ఈ ప్లేన్‌లో ప్రయాణం చేయవచ్చు. 150 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 30 నిమిషాలలోనే ఈ సీప్లేన్ ద్వారా విజయవాడ నుండి శ్రీశైలం చేరుకోవచ్చు. టేకాఫ్, ల్యాండింగ్‌కు 10 నిమిషాలు, ప్రయాణానికి 20 నిమిషాల సమయం తీసుకుంటుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు ఈ సీప్లేన్ సర్వీసులను విస్తరించనున్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద పున్నమిఘాట్‌కు ఈ సీప్లేన్ చేరుకుంది. ఇక్కడ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్లేన్‌లో ప్రయాణించి, శ్రీశైలం చేరుకుని, అక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటారు.

