Home Page SliderNational

ఇంటికెళ్లి ఇళయరాజాకు బర్త్‌డే విషెస్ చెప్పిన సీఎం స్టాలిన్

ఈ రోజు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పుట్టినరోజు. కాగా ఇళయరాజా దక్షిణ భారతదేశంలో తన పాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కాగా ఆయన ఇప్పటివరకు తెలుగు,తమిళ్,మళయాళం భాషల్లో దాదాపు 1000 సినిమాల్లో 5000 పాటలకు సంగీతం అందించారు. అయితే ఆయన తెలుగులో స్వాతి చినుకులు,కొండవీటి దొంగ,సాగరసంగమం,గీతాంజలి,అభినందన,జగదేకవీరుడు అతిలోక సుందరి ,బొబ్బిలి రాజాతోపాటు మరెన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. ఈ విధంగా ఆయన తన సంగీతంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. అయితే ఈ రోజు ఇళయరాజా పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు  సినీ,రాజకీయ ప్రముఖులు,సంగీత ప్రియులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కానీ తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం..తానే స్వయంగా ఇళయరాజా ఇంటికి వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ఇళయరాజాను సన్మానించారు. సంగీతంతో ఆయన చేసే మాయాజాలానికి మైమరచి పోయిన అభిమానిగా శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉంది అని సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు.