ఆ విషయం లో సీఎం రేవంత్ రెడ్డి గ్రేట్ : ఎమ్మెల్యే రాజాసింగ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోవుల సంరక్షణ కోసం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి కొత్త గోశాలల నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడం, గో సంరక్షణకు సంబంధించి సమగ్ర విధానాలను రూపొందించేందుకు ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గోవుల రక్షణకు ప్రత్యేకమైన ఫోర్స్ ఏర్పాటు చేయాలని, అందులో తనను సభ్యునిగా చేర్చాలని రాజా సింగ్ అభ్యర్థించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తర్వాత దేశంలో గోవులకు సేవ చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన అభిప్రాయపడ్డారు. వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ సమీపంలో గోశాలలు నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్యలు గోవుల సంరక్షణలో ముఖ్యమైన మలుపుగా మారుతాయని భావిస్తున్నారు.

