Telangana

హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ దేశంలోనే సంచలనం

Share with

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ శాంతి భద్రతల మీద దృష్టి పెట్టారన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. నేటి ఆధునిక రంగంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే విధంగా పోలీసు శాఖను సీఎం ప్రోత్సహించారన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ఈ అద్భుత రూపకల్పన జరిగిందన్నారు. పోలీసుశాఖలో ఉన్న అన్ని విభాగాల అధికారులు ఇక్కడ నుంచి సమన్వయం చేసేలా టెక్నాలజీ ఫ్యుజింగ్ సెంటర్  ఉంటుందని వెల్లడించారు. అంతేకాకుండా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎన్నో ప్రత్యేతలు కలిగి ఉందని..ఇది పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని పర్యావరణహిత బిల్డింగ్ అన్నారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కరెంట్ ఖర్చులు తగ్గే విధంగా సోలార్ ప్లాంటును కూడా ఏర్పాటు చేశామని సీపీ సి.వి.ఆనంద్ మీడియాకు వివరించారు.  ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ బిల్డింగ్‌ను మొత్తం 5 టవర్లుగా విభజించామన్నారు. టవర్ A లోని 18వ ఫ్లోర్‌లో సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం..14వ ఫ్లోర్‌లో గ్యాలరీ ఉంటుందని తెలియజేశారు. బిల్డింగ్‌లోని 5,6,7 ఫ్లోర్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆవిష్కరించామన్నారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ పూర్తిగా సీఎం కేసీఆర్ ఆలోచనే అని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో నూతనంగా ప్రారంభం కానున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ గురించి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ సీఎం కేసీఆర్  చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. ఇది మాత్రమే కాకుండా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తామన్నారు.