Telangana

యాదాద్రీశుని సేవలో సీఎం కేసీఆర్

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్ దంపతులు… కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా అందించారు. స్వామివారికి బంగారాన్ని కేటీఆర్ మనుమడు హిమాన్షు అందించారు. ఆలయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇక యాదాద్రి ఆలయ పనులు ఎంత వరకు వచ్చాయన్నదానిపై సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. కొండ కింద చేపట్టిన సత్యనారాయణ వ్రత మండపం, బస్ స్టేషన్, గండి చెరువు ఆధునీకరణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రికి సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో చేరుకున్నారు. కేసీఆర్ పర్యటనతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.