కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సీఎం జగన్ భేటీ
ఏపీ సీఎం జగన్ గత రెండు రోజుల నుంచి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. గత రాత్రి ఆయన అమిత్ షా తో సమావేశమై సుమారు 40 నిమిషాలకు పైగా వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ వీటిలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా సవరించిన అంచనాలకు త్వరగా ఆమోదం తెలిపేలా చూడాలని సీఎం జగన్ అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని సీఎం జగన్ కోరారు. అలాగే ఏపీ భవన్ షెడ్యూల్లోని 9,10 ఆస్తుల విభజన అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన అమిత్ షా వద్ద ప్రస్తావించారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను వెంటనే వచ్చేలా చూడాలని సీఎం జగన్ అమిత్‌షాను కోరినట్లు సమాచారం.

