Andhra PradeshHome Page Slider

వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని సీఎం జగన్ ప్రజలను బెదిరిస్తున్నారు:జనసేన

ఏపీలో అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం  కొనసాగుతోంది . కాగా ఏపీలో అధికార పార్టీ వైసీపీపై ప్రతిపక్ష పార్టీ జనసేన విమర్శలు గుప్పిస్తోంది. ఏపీలో  ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాలు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగానే ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి సభకి రాకపోతే పథకాలు ఆపేస్తామని గ్రామ వాలంటీర్ క్లస్టర్‌లోని ప్రజలను హెచ్చరిస్తున్న ఓ ఆడియో క్లిప్‌ను జనసేన శతజ్ఞి తాజాగా ట్వీట్ చేసింది. జగన్ నీ సభలకు,పథకాలకు సంబంధం ఏంటి? ఏపీలో ప్రజలు సభలకు రావాలా వద్దా అనేది వారి ఇష్టం. సభలకు రాకపోతే పథకాలు ఆపేస్తావా? వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో ప్రజలను బెదిరిస్తున్నావా? సీఎం జగన్ అని ప్రశ్నించింది. ఏపీలో సీఎం జగన్ పాపులారిటీ కోసం ప్రజల పట్ల సైకోలో వ్యవహరించడం ఏంటని జనసేన పార్టీ మండిపడింది.