దత్తపుత్రుడితో దత్తతండ్రి ఏం మాట్లాడిస్తున్నారో.. చూస్తున్నా
ఏపీ సీఎం జగన్ ఈ రోజు కృష్టాజిల్లాలోని అవనిగడ్డలో పర్యటించారు. కాగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏపీలో నిషేధిత భూముల జాబితా నుంచి షరతులు ఉన్న పట్టా భూములు తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఈ క్లియరెన్స్ పత్రాలను సీఎం జగన్ రైతులకు అందించారు.అనంతరం ఆయన జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తాజాగా తమ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పవన్‌వ్యాఖ్యలకు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో అందరూ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని చెబుతారా అని సీఎం మండిపడ్డారు. రాజకీయ నాయకులు సమాజానికి ఇచ్చే మెసేజ్ ఇదేనా? అని సీఎం ప్రశ్నించారు. అందరూ 3,4 పెళ్లిళ్లు చేసుకుంటే సమాజంలో మహిళల పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారా మన నాయకులు అని సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వారు చేసింది చెప్పుకోలేక బూతులు తిడుతున్నారన్నారు. వీధి రౌడీలు కూడా అలా మాట్లాడరని సీఎం దుయ్యబట్టారు. రాష్ట్ర నాయకులుగా ఉన్నవారు చెప్పులు చూపిస్తూ..బూతులు తిట్టడం సమంజసమేనా? దత్తపుత్రుడితో దత్తతండ్రి ఏం మాట్లాడిస్తున్నారో చూస్తున్నామన్నారు. మూడు పెళ్లిళ్ల వల్ల మేలు జరుగుతుందని.. మీరు కూడా చేసుకోవాలని చెబుతున్నారన్నారు. ఒక్క జగన్‌ను కొట్టడానికి ఇంతమంది ఏకం మవుతున్నారన్నారు. ఇది మంచికి, మోసానికి జరుగుతున్న యుద్ధమని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్… అబద్దాలను,మోసాలను, కుట్రలను,పొత్తులను నమ్ముకున్నారని… తాను మాత్రం దేవుడిని,అక్కచెల్లెమ్మలను నమ్ముకున్నానన్నారు.

