నూతన సచివాలయ పనులను పరిశీలించిన సీఎం
నూతనంగా నిర్మిస్తున్న సెక్రటేరియట్‌ను సీఎం కేసీఆర్ సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను ఆరా తీశారు. గతంలోనూ పలుమార్లు స్వయంగా ఆయన వెళ్ళి నిర్మాణ పనులను పరిశీలించి.. అధికారులను పలు సూచనలు చేశారు. సీఎం సెక్రటేరియట్‌కు రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత త్వరగా నాణ్యతలో రాజీ లేకుండా పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను సూచించారు.
మరోవైపు త్వరలోనే కొత్త సెక్రటేరియట్‌ను ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే కొత్త సెక్రటేరియట్‌కు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినట్లు ఆయన ట్వీట్ చేశారు. 150-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నారు. దీనికోసం అధికారులు, నిర్మాణ సంస్థ ప్రత్యేక దృష్టి సారించాయి. మూడు షిఫ్ట్‌లలో కలిపి దాదాపు వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుగులోనూ పనులు జరుగుతున్నాయి. 617 కోట్లతో నిర్మితమవుతున్న నూతన సచివాలయ భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో నిర్మిస్తున్నారు.

