ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ కానుక పంపిణి
చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోన్న ఆరా ఫౌండేషన్, క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నిరుపేద క్రైస్తవులకు ఉచితంగా చీరల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టింది. మహిళలకు చీరను పండుగ కానుక ఆరా ఫౌండేషన్ అందిస్తోంది. నియోజకవర్గంలో ఉన్న సుమారుగా 10 వేల మందికి చీరల పంపిణీ చేయాలని సంస్థ నిర్ణయించింది. వృద్ధులు, వితంతులకు, సంఘ కాపరులకు పండుగ సందర్భంగా క్రిస్మస్ కానుకను అందిస్తోంది. గత వారం రోజులుగా నియోజకవర్గంలో ఆరా ఫౌండేషన్ కార్యకర్తలు క్రిస్మస్ కానుకను పంపిణీ చేస్తున్నారు. ఆరా ఫౌండేషన్ నిర్ణయాన్ని క్రైస్తవులు నిండు మనసుతో స్వాగతిస్తున్నారు. వ్యవస్థలు మాత్రమే చేయగలిగిన పనిని ఆరా పోల్స్ అధినేత మస్తాన్ గారు చేయడం ఎంతో గొప్ప విషయమని వారు అభిప్రాయపడుతున్నారు.


