యుద్ధంపై చైనా అధ్యక్షుని కీలక వ్యాఖ్యలు
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ యుద్ధాన్ని కాంక్షిస్తున్నట్లు సమాచారం. ఇటీవల పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ బ్రిగేడ్‌ను సందర్శించిన అధ్యక్షుడు యుద్ధానికి సన్నాహాలు చేయవలసిందిగా సూచించారు. దళాలను బలోపేతం చేయాలని, పటిష్టమైన పోరాట సామర్థ్యాలను పెంచుకోవాలని ఆదేశించారు. దేశ భద్రత, ప్రధాన ప్రయోజనాలను కాపాడాలని సైన్యాన్ని కోరారు. తైవాన్‌ను పూర్తి గుప్పెట్లో పెట్టుకోవాలని డ్రాగన్ కొత్త ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం. అందుకే యుద్ధానికి సన్నదమవుతోందని అక్కడి అధికారిక మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి.

