నియోజకవర్గంలో చెడ్డీ గ్యాంగ్‌లు, బెల్ట్ బ్యాచ్‌లు… వైసీపీ ఎమ్మెల్యే వసంత సంచలన వ్యాఖ్యలు
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్, తలదూర్చి చికాకు పెడుతున్నారని గత కొంతకాలంగా గుస్సాగా ఉన్న వసంత, సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత తన పని తాను చేసుకుపోతున్నారు. అయినప్పటికీ నియోజకవర్గంలో తనను ఇబ్బంది పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నట్టు… నియోజకవర్గంలోని జి కొండూరు మండలం కేడీసీసీ బ్యాంక్ భవన ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. నియోజకవర్గంలో (జి.కొండూరు గ్రామంలో) ఆవారాగా తిరిగే చెడ్డీ గ్యాంగ్‌లు, బ్లేడ్ బ్యాచ్‌లు, తొట్టి గ్యాంగ్‌లు ఓవరాక్షన్ చేస్తున్నాయన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా పార్టీని బలహీనపర్చాలన్న లక్ష్యంతో పని చూస్తున్నారని ధ్వజమెత్తారు. విపక్షంలో ఎవరూ మాట్లాడేవాళ్లు లేకపోవడంతో… స్వపక్షంలోంచే… ఊరికో ఉలిపికట్ట తయారు చేసే… నాయకత్వాన్ని బలహీనపర్చాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామాల్లో ఇబ్బంది పెట్టాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే ఇలాంటి వాటి వల్ల భయపడాల్సిన పనిలేదని.. నిజమైన వైసీపీ కార్యకర్తలు, వీటిని అడ్డుకోవాలన్నారు. చౌకబారు విమర్శలు చేసేవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.

