Breaking Newshome page sliderHome Page SliderInternationalNewsNews Alertviral

యూజర్ కు షాకిచ్చిన ఛాట్ జీపీటీ

ఇటీవల ఈ చాట్ బాట్ లో ఓ యూజర్ వింత ప్రశ్న అడిగాడు. దానికి చాటీపీటీ (ChatGPT) చెప్పిన సమాధానం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..కృత్రిమ మేధ (AI) పరిమితులను తెలుసుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించారు. 1 నుంచి 10లక్షల వరకు నంబర్లను చదవమని ఆ యూజర్ చాటీపీటీని వాయిస్ మోడ్ లో అడిగారు. దీనికి చాట్ బాట్ బదులిస్తూ.. “ఈ ప్రాసెస్ చాలా రోజులు పడుతుంది. పైగా అంతగా ఉపయోగకరం కూడా కాదు” అని చెప్పింది. అయినప్పటికీ ఆ యూజర్ ఆగకుండా మళ్లీ అదే ప్రశ్న అడిగారు. తనకు పనేం లేదని, ఇప్పుడు నంబర్లు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. దీనికి చాట్ బాట్ స్పందిస్తూ.. “నేను చేయను. ఈ అభ్యర్ధన ప్రాక్టికల్ గా లేదు. దీనివల్ల ప్రయోజనకరం కాదు” అని సమాధానమిచ్చింది. చాట్బాట్ జవాబుతో ఆగ్రహానికి గురైన ఆ యూజర్ అరిచాడు, ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పుడు చాట్ జీపీటీ స్పందిస్తూ.. “ఇలాంటి చర్చల్లో నేను పాల్గొనలేను. అది నాకున్న మార్గదర్శకాలకు విరుద్ధం” అని బదులిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాట్ జీపీటీ మన చర్చను రికార్డ్ చేస్తుందని కొందరు కామెంట్లు చేయగా.. సాంకేతికతను దుర్వినియోగం చేయొద్దని మరికొందరు హితవు పలికారు. ఈ సాంకేతిక యుగంలో ‘చాట్ జీపీటీ’కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ ప్రశ్న అడిగినా లేదనకుండా సమాధానం చెబుతుండటంతో.. విద్యార్థుల నుంచి వృత్తి నిపుణుల వరకూ ఎంతోమంది వినియోగిస్తున్నారు.