Home Page SliderTelangana

సూసైడ్ నోట్‌తో ‘గేమ్ ఛేంజర్’ టీమ్‌‌కు చరణ్ అభిమాని హెచ్చరిక, రిలీజ్ డేట్ కోసం డిమాండ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్నాడు. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కైరా అద్వానీ, అంజలి ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడిందని, 2025లో విడుదల చేయాలని భావిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో రామ్ చ‌ర‌ణ్ అభిమాని సూసైడ్ నోట్ పంపాడు. రిలీజ్ డేట్‌పై క్లారిటీ రాకపోతే చచ్చిపోతానని బెదిరించాడు. ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాస్తవానికి ఈ సినిమా ఈపాటికే విడుదలై ఉండాల్సింది. కానీ దర్శకుడు శంకర్ కమల్ హాసన్ “భారతీయుడు 2” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దీంతో ఈ సంవత్సరం విడుదల కావాల్సిన “గేమ్ ఛేంజర్” ఇప్పుడు వాయిదా పడింది.