కోటి సంతకాల కార్యక్రమంలో మార్పులు
ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న కోటి సంతకాల ఉద్యమ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేసినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
రాష్ట్రపతి పర్యటన కారణంగా గవర్నర్ కార్యాలయం షెడ్యూల్ మార్చినందున, 16న జరగాల్సిన భేటీ 17వ తేదీకి మార్చినట్లు ఆయన వెల్లడించారు. ఆ రోజున పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతలతో కలిసి గవర్నర్‌ను కలవనున్నట్లు చెప్పారు.
అదేవిధంగా, జిల్లాస్థాయి ర్యాలీలు 13నుండి 15వ తేదీకి మార్చినట్లు సజ్జల వెల్లడించారు. ర్యాలీలు ముగిసిన తర్వాత అక్కడి నుంచే తదుపరి కార్యక్రమాలకు నేతలు బయలుదేరాల్సి ఉంటుందని చెప్పారు.నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు మాత్రం యథాప్రకారం ఈ నెల 10వ తేదీన నిర్వహించాలని సూచించారు.

