బట్టలు విప్పించిన ఘటనలో బదిలీ
విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీల ముందు బట్టలు విప్పించారనే ఘటనలో మొత్తం 66 మంది సిబ్బందిపై బదిలీ వేటు పడింది. ఖైదీల ఎదుట తమను దుస్తులు విప్పించారని ఆరోపిస్తూ తమ తమ కుటుంబీకులతో కలిసి జైలు ఎదుట వార్డరర్స్,హెడ్ వార్డరర్స్ గత రెండు రోజుల కిందట ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.దీనిపై అధికారులు విచారణ చేపట్టకుండానే దాదాపు 66 మందిని బదిలీ చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా తాము ఖైదీల ముందు బట్టలు విప్పించామని వారు చేస్తున్నఆరోపణల్లో ఎంత మాత్రమూ నిజము లేదని జైలు అధికారులు చెబుతున్నారు. కంటి తుడుపు చర్యగా బదిలీలైతే చేశారు గానీ విచారణకు ఆదేశించకపోవడం కొసమెరుపు.

