పంజాబ్ సీఎం రెండో పెళ్లి
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. డాక్టర్ గుర్ ప్రీత్ కౌర్ అనే మహిళను గురువారం ప్రైవేటు వివాహం చేసుకోబోతున్నారు. భగవంత్ మాన్‌కు ఇది రెండో పెళ్లి. మొదటి భార్య ఇంద్రప్రీత్‌కు ఆరేళ్ల క్రితం ఆయన విడాకులిచ్చారు. మొదటి భార్యతో భగవంత్ మాన్‌కు ఇద్దరు సంతానం ఉన్నారు. వారు ప్రస్తుతం అమెరికాలో నివశిస్తున్నారు. వివాహ వేడుకకు… ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. 1973 అక్టోబర్ 17న సంగ్రూర్ జిల్లాలో భగవంత్ మాన్ జన్మించారు. కమెడియన్‌గా పలు షోలతో పాపులర్ అయ్యారు. 2011లో రాజకీయాల్లోకి అడుగుపెట్టినా 2014లో ఆప్ తరపున సంగ్రూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఆప్ స్వీప్ చేయడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు భగవంత్ మాన్ సింగ్.