మాచర్ల అల్లర్ల వెనుక చంద్రబాబు, లోకేష్‌ల హస్తం
మాచర్ల అల్లర్ల వెనుక చంద్రబాబు, లోకేష్‌ల హస్తం ఉందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఫ్యాక్షన్ నాయకుడిని మాచర్లకు పంపి దాడులు చేపిస్తున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి ఫైర్ అయ్యారు. జూలకంటి బ్రహ్మారెడ్డి వచ్చిన తరువాత మాచర్లలో విధ్వంసాలు పెరిగిపోయాయన్నారు. గొడవలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని కుట్ర చేస్తున్నారన్నారు. ప్రశాంతంగా కార్యక్రమం చేసుకోవాలని అనుకున్న నాయకులను… కర్రలు, రాడ్‌లతో దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు.
టీడీపీ ప్రభుత్వం కార్యక్రమాలు ఓర్చుకోలేక ప్లాఫ్ షోలు చేస్తుంటే ప్రజలు తిరగబడుతున్నారని, అందుకే ప్రచారం కోసం మాచర్లలో దాడులకు తెగబడిందని ఎమ్మెల్యే వివరించారు. టీడీపీ అసలు రంగు ఇదేనని ప్రజలు ఇప్పటికే బాగా తెలుసుకున్నారని ఇలాంటి దాడులతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భయపడేది లేదన్నారు. టీడీపీ నేత బ్రహ్మానందరెడ్డి తప్పుడు ప్రచారాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్లు, ఇళ్లను ధ్వంసం చేయడంతోపాటు ప్రజలపై దాడికి పాల్పడేలా టీడీపీ కార్యకర్తలకు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు.

