పొత్తుల కోసం చంద్రబాబు తహతహ
ఎన్నికలలో పొత్తుల్లేని చరిత్ర చంద్రబాబుకు లేదని భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని తిట్టిన నోటితోనే చంద్రబాబు మళ్ళీ పొగుడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీతో చంద్రబాబును కలిపేందుకు పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్‌ను కలిసి పైరవీలు చేస్తున్నారన్నారు. పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీకి ఏజెంట్ లాగా మారారని దుయ్యబట్టారు. భారతీయ జనతా పార్టీతో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ చాలని చంద్రబాబు చెప్పిన మాటలు ప్రజలు మరిచిపోలేదని సజ్జల పేర్కొన్నారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించే సత్తా చంద్రబాబుకు లేదన్నారు. ప్రజలను భ్రమలలో పెట్టాలనుకునే వారే భ్రమల్లో బతుకుతున్నారని చురకలంటించారు. వైయస్సార్సీపీ ప్రభుత్వం పై పాజిటివ్ ఓటు 70% పైన ఉన్నప్పుడు 30 శాతం ఉన్న బాబు అండ్ కో ఎంతమంది కలిస్తే ఏమవుతుందన్నారు. ఎన్నికల సమయం వచ్చి మరో 10 శాతం తీసేసిన 60% ఒకవైపే ఉన్నప్పుడు వాళ్ల 40 శాతం అంతా అందరూ కలిసికట్టుకుని వచ్చిన కూడా ఏమవుతుందన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో చంద్రబాబుకు అడ్రస్ కూడా మిగలదని పేర్కొన్నారు.

