“చంద్రబాబు వల్ల ఏపీకి రూ.లక్ష కోట్ల నష్టం వచ్చింది”:వైసీపీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. కాగా చంద్రబాబు 2015లో సీఎంగా ఉన్న సమయంలో ఓటుకు నోటు కేసులో దొరికిపోయారని తెలిపింది. అందువల్లే ఏపీకి రూ.లక్ష కోట్ల నష్టం వచ్చిందని వైసీపీ ఆరోపించింది. కాగా ఈ కేసు వల్లే చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి ఏపీకి రావాల్సి వచ్చిందని దుయ్యబట్టింది. అప్పుడు చంద్రబాబు ఏపీకి రావాల్సిన షెడ్యూల్ 9,10 సంస్థల విషయం తేల్చకుండానే వచ్చేశారని పేర్కొంది. దీంతో షెడ్యూల్ 9,10కి సంబంధించిన సంస్థల ఆస్తులు,విభజన చట్టంలో లేని ఆస్తుల పంపకంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని వైసీపీ ట్వీట్ చేసింది.

