Andhra PradeshHome Page Slider

చట్టాలకు చంద్రబాబు అతీతుడా సజ్జల ఎద్దేవా

రాజ్యాంగం చట్టాలకు చంద్రబాబు అతీతుడా! దొంగను పట్టుకుంటే మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందా? అని వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఇంట్లో ఉంటే అది అరెస్ట్ ఎలా అవుతుందన్నారు. జైల్లో చంద్రబాబుకు రాచ మర్యాదలు ఇస్తున్న ఎదురుదాడి చేయటం సరికాదన్నారు. అవినీతిని చంద్రబాబు సానుభూతికి ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో తమకు సంబంధమే లేదని సిమెన్స్ స్పష్టం చేసిందన్నారు. ఈ కుట్రకు మాస్టర్ మైండ్ చంద్రబాబు నాయుడు అని సజ్జల ఆరోపించారు. దోచుకోవటానికే ఒక స్కీం పెట్టి సక్సెస్ అయ్యారని 371 కోట్లు డబ్బు ఎటుపోయిందో ఐటీ శాఖ నోటీసుల్లో తేలిందన్నారు. ఎప్పటికీ తానే సీఎం గానే ఉంటానని ఓవర్ కాన్ఫిడెన్స్ తో బాబు అవినీతికి పాల్పడ్డాడని ఫైర్ అయ్యారు. ఇంకా రచ్చ చేసుకుంటే వాళ్లే అభాసుపాలవుతారన్నారు. అయినా చంద్రబాబు నిరంతర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడని అనేక పార్టీల నేతలతో తనకు అనుకూలంగా మాట్లాడిస్తున్నాడని దుయ్యబట్టారు.