అంతరిక్ష కేంద్రం నుండి చందమామ ఫొటో వైరల్..
అంతరిక్ష కేంద్రం నుండి నాసా వ్యోమగామి మాథ్యూ డొమినిక్ తీసిన చందమామ ఫొటో సోషల్ మీడియాలలో వైరల్ అవుతోంది. పసిఫిక్ మహాసముద్రంపైన అస్తమిస్తున్న చంద్రుని అద్భుతంగా ఫొటో తీసారు మాథ్యూ. మేఘాలు, నీలిరంగులపైన ఉన్న చందమామ చాలా అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మాథ్యూ డొమినిక్ నాలుగు నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నారు. హవాయి సమీపంలోని ఉష్ణమండల తుఫానును చిత్రీకరించాలని భావించినట్లు తెలిపారు. ఈ క్రమంలో చంద్రుని అస్తమయం ఆసక్తి కలిగించగా ఫొటో తీసినట్లు తెలిపారు.

