ఖైదీ పొట్టలో సెల్‌ఫోన్
బీహార్‌లో గోపాల్‌గంజ్ జిల్లా పోలీస్ స్టేషన్‌లో ఓ ఖైదీ సెల్‌ఫోన్ మింగేసిన విచిత్ర ఘటన జరిగింది. శనివారం నాడు ఆ జైలులోని పోలీసులు తనిఖీలు చేస్తున్నప్పుడు ఖైసర్ అలీ అనే ఖైదీ దొరికిపోతానేమో అనే భయపడి తన సెల్‌ఫోన్‌ను మింగేశాడు. ఆదివారం నాడు ఖైదీ విపరీతమైన కడుపునొప్పితో మెలితిరిగి పోతుండంతో పోలీసులు గోపాల్‌గంజ్ హాస్పటల్‌కి తరలించారు. డాక్టర్లు అనుమానంతో ఎక్సరే తీయించగా ఫోన్ మింగేసిన విషయం తెలిసింది. ఈ ఖైదీ మాదకద్రవ్యాల కేసులో 2020 జనవరిలో అరెస్టు అయ్యాడు. ఖైదీలకు మొబైల్ అందుబాటులో ఉండడంతో కంగుతిన్నారు పోలీసులు. దీనితో జైలు అధికారులు జైళ్లలో తనిఖీలను చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఏర్పడింది.