ఇకపై TSPSC కార్యాలయంలోకి సెల్‌ఫోన్లు అనుమతించబడవు
రాష్ట్రంలో TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం సృష్టించిన భీభత్సం అంత ఇంత కాదనే చెప్పాలి. దీంతో ప్రస్తుతం తెలంగాణా TSPSC కార్యాలయం ప్రతినిత్యం నిరుద్యోగుల నిరసనలతో అట్టడుకుతుంది. కాగా ప్రజలు తెలంగాణా ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇకపై TSPSC ఉద్యోగులెవరూ సెల్‌ఫోన్లు,పెన్‌డ్రైవ్‌లను కార్యాలయంలోకి తీసుకురాకుండా ప్రభుత్వం వాటిపై నిషేదం విధించనుంది. అలాగే అభ్యర్థులు నేరుగా ఆఫీసుకు వచ్చి ఫిర్యాదు చేసే అవకాశాన్ని కూడా రద్దు చేయనుంది. దీనికి ప్రత్యమ్నాయంగా అభ్యర్థుల సమస్యలను ఇకపై ఆన్‌లైన్‌లోనే పరిష్కరించే విధంగా పటిష్టమైన వ్యవస్థను తయారు చేయనుంది. అంతేకాకుండా ఇకపై అన్నీ పోటీ పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని TSPSC నిర్ణయించింది.

