Home Page SliderNews AlertTelangana

ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనేందుకు సెలబ్రిటీలు ఆసక్తి

రోజు రోజుకు ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం ఇటీవల భారీగా పెరిగిపోతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రస్తుతం అందరి చూపు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మళ్ళుతోంది. ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలపై అందిస్తున్న ప్రోత్సాహంతో  కంపెనీలు పెద్ద ఎత్తున మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. హైదరాబాద్‌ మహానగరంలో ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్ళు మరింతగా పెరిగిపోయాయి.  సామాన్యుడి నుండి సెలబ్రిటీల వరకు వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి 1.9 కోట్ల రూపాయలతో Tayota Vellfire కారును కొనుగోలు చేశారు. దానిని ఖైరతాబాద్‌ ఆర్టీఏ ఆఫీసులో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. మరో నటుడు రవితేజ 34.49 లక్షలతో byd atto ఎలక్ట్రిక్‌ కారును కొనుగోలు చేశారు. ఆయన కూడా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. తాజాగా హీరో అల్లరి నరేష్‌ 64.95 లక్షలతో KIA EV6 కారును కొనుగోలు చేశారు. ఖైరతాబాద్‌ ఆర్టీఏ ఆఫీసులో రిజిస్ట్రేషన్‌ చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేసే వారికి భారీగా ప్రోత్సాహకాలు ఇస్తుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా రోడ్‌ ట్యాక్స్‌ మినహాయింపు కొనుగోలుదారునికి వెసులుబాటును కల్పిస్తుందన్నారు.