11 కోట్ల “చిల్లర” దొంగల పై సీబీఐ దర్యాప్తు
నోట్ల విలువ పెరిగిన తర్వాత చిల్లరకు ఉన్న ప్రాధాన్యత కొంతమేర పడిపోయిందనే చెప్పొచ్చు. అందులో ఇప్పుడున్న టెక్నాలజీతో నోట్లను లెక్కించేందుకు ఆధునాతన పరికారాలు వాడుకలోకి వచ్చాయి. కానీ చిల్లర లెక్కించేందుకు ఇంతవరకు ఎటువంటి పరికారాలు లేవు.. వాటిని లెక్కించాలంటే చేతుల సాయంతోనే లెక్కించాల్సి వస్తుంది. వందో రెండోందలో అయితే వాటిని లెక్కపెట్టడం వీలైతుంది. కానీ కొన్ని కోట్ల చిల్లర లెక్కపెట్టడం అంతా సామాన్యమైన విషయం కాదు. ఈ విషయాన్ని అదునుగా చేసుకొని కొంతమంది ఏకంగా 11కోట్ల చిల్లరను మాయం చేశారు. రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెహందీపుర్ శాఖ ఖజానా నుండి రూ.11 కోట్ల విలువైన చిల్లర మాయమయ్యింది. ఈ కేసును కొద్ది రోజులు స్దానిక పోలీసులు దర్యాప్తు చేస్తుండగా..కొన్ని అంతరాయలు ఏర్పడిన కారణంగా దీనిని సీబీఐకి అప్పగించాలని రాజస్థాన్ హైకోర్టుని SBI శాఖ కోరింది. దీనికి సంబంధించిన విచారణను ప్రస్తుతం CBI నిర్వహిస్తుంది.

విస్తృత విచారణలో భాగంగా ఢిల్లీ , జైపూర్ , దౌసా , కరౌలీ , సవాయ్ మాధోపుర్ , అళ్వర్ , ఉదయ్‌పుర్ , భిల్వారా సహా మొత్తం 25 ప్రాంతాల్లో సోదాలు జరిపింది. ఖజనాలోని నిల్వలకు సంబంధించి అనుమానాలు తలెత్తడంతో గత ఏడాది ఆగస్టులో మెహందీపుర్ ఎస్‌బీఐ శాఖ డబ్బుల లెక్కింపు ప్రక్రియ చెేపట్టగా , రూ. 13 కోట్ల చిల్లర కాయిన్లకు గాను కేవలం రూ.2 కోట్ల కాయిన్లే ఉన్నాయని… మిగిలిన నాణేలు మాయం అయ్యాయని గుర్తించారు.

