తీన్మార్ మల్లన్న పై కేసు నమోదు….
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు మరియు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ జాగృతి కార్యకర్తలు మేడిపల్లిలోని క్యూ న్యూస్ కార్యాలయంపై దాడికి పాల్పడి, కార్యాలయంలోని ఫర్నిచర్, అద్దాలు, కంప్యూటర్లు ధ్వంసం చేశారు. అక్కడున్న సిబ్బందిపై చేయిచేసుకున్న ఈ ఘటనలో, తీన్మార్ మల్లన్నకు కుడి చేతికి గాయమైంది. దీంతో ఆగ్రహావేశానికి లోనైన జాగృతి కార్యకర్తలు ఎల్బీనగర్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. తమ నాయకురాలిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన జాగృతి శ్రేణులతో పాటు, వివిధ సంఘాల ప్రతినిధులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు

