Andhra PradeshHome Page Slider

నటుడు పోసానిపై కేసు నమోదు

సినీనటుడు పోసాని కృష్ణమురళిపై రాజమహేంద్రవరంలో కేసు నమోదయ్యింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబసభ్యులపై పోసాని గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ  జనసేన నాయకులు ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వ కాలంలో అనేక మార్లు పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తలపై సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో దూషించారని అప్పుడు కంప్లైంట్ చేసినా, స్వీకరించలేదని తెలిపారు. అందుకే ఇప్పుడు మరోసారి విచారణ చేయాలని కోరారు.