Home Page SliderNationalNews Alert

సినిమా స్టైయిల్‌లో ద్విచక్రవాహనాలపై దూసుకెళ్లిన కారు

ఓ మహిళ డ్రైవింగ్‌ చేస్తూ కారుపై నియంత్రణ కోల్పోయింది. పార్క్‌ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలపైకి కారును దూసుకెళ్ళింది. చూడ్డానికి ఈ దృశ్యం సినిమా సీన్‌లా కనిపించింది. ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని కాన్పూర్‌ పట్టణంలో చోటు చేసుకుంది. ఆమె కారును రివర్స్‌ మోడ్‌లో పార్క్‌ చేసేందుకు ప్రయత్నంచినప్పుడు ఇలా జరిగినట్టు చెబుతున్నారు. అక్కడికి చేరుకున్న స్థానికులు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. దీనిని ఎవరో వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. సదరు మహిళపై ట్రాఫిక్‌ పోలీసులు చలాన్‌ విధించారు. వేగాన్ని అదుపు చేసుకోవడంలో విఫలం కావడమే ఈ ప్రమాదానికి దారితీసినట్టు పోలీసులు తెలిపారు.