Home Page SliderTelangana

ఆ తేదీ నుంచి బస్సులు బంద్!

తెలంగాణలో ఆర్టీసీ జేఏసీ సమ్మెకు రెడీ అయింది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు అందించింది. తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ప్రభుత్వంలో విలీనం, 2 PRCలు, CCS, పీఎఫ్ డబ్బులు రూ.2700 కోట్ల చెల్లింపులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది. డిమాండ్లు నెరవేర్చకుంటే ఫిబ్రవరి 9 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తూ ఆర్టీసీ యాజమాన్యానికి ఇచ్చిన నోటీసుల్లో స్పష్టం చేసింది. మహాలక్ష్మీ స్కీంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని.. రద్దీ పెరిగితే బస్సులు పాడవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందన్నారు.