Home Page SliderTelangana

పంట పొలాల్లో నోట్ల కట్టలు..

నల్గొండ జిల్లా దామచర్ల మండలం బొత్తలపాలెం గ్రామంలో పొలానికి వెళ్లిన ఓ రైతుకు 20 లక్షల విలువైన 500 నోట్ల కట్టలు కనిపించాయి. అయితే.. నోట్లపై చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉండటంతో ఇది దొంగ నోట్లు ముద్రించే వారి పనే అయి ఉంటుందని భావించి రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నకిలీ నోట్లు పొలంలోకి ఎలా వచ్చాయి, వాటిని ఎందుకు వినియోగిస్తున్నారనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.