కపిల్ దేవ్ రికార్డ్ బ్రేక్ చేసిన బుమ్రా..
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ బుమ్రా దూకుడుగా సత్తా చాటుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టిన బుమ్రా ఇప్పుడు రెండవ ఇన్నింగ్స్‌లో కూడా అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సవ్యసాచిలా మెరిసిపోతున్నాడు. తాజాగా నేడు స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు బుమ్రా. ఆస్ట్రేలియాలో 52 టెస్టు వికెట్లు పడగొట్టి, గతంలో కపిల్ దేవ్ పేరిట ఉన్న 51 వికెట్లను అధిగమించాడు.

