Andhra PradeshHome Page Slider

టిటిడి ఉద్యోగులకు బంపర్ ఆఫర్

టిటిడి తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. టిటిడి ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నేడు ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పీస్ రేటు క్షురకులకు కనీస వేతనం రూ. 20 వేలకు పెంచాలనే నిర్ణయానికి కూడా ఈ సమావేశంలో ఆమోదం లభించింది. లడ్డూపోటు కార్మికులకు అదనంగా రూ.10 వేలు పెంచుతున్నారు. ఈ సందర్భంలో ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గోవింద నామకోటి పుస్తకాలను, ఐదు భాషలలో ముద్రించిన భగవద్గీత పుస్తకాలను ఆవిష్కరించారు.