బడ్జెట్ 2023-24 హైలెట్స్…
మొత్తం బడ్జెట్ 45.03 లక్షల కోట్లు
మొత్తం టాక్స్‌ల రూపేణా వచ్చే ఆదాయం 33.61 లక్షల కోట్లు
కేంద్ర ఆదాయంలో రాష్ట్ర పన్నుల వాటా 10.22 లక్షల కోట్లు
ఇన్‌కంటాక్స్ రూపేణా వచ్చేది 9.01 లక్షల కోట్లు
జీఎస్టీ ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయం 9.57 లక్షల కోట్లు
వేతన జీవులకు ఊరట
ప్రస్తుతం ఉన్న 6 శ్లాబులను 5 శ్లాబులకు తగ్గింపు
ఆదాయం 7 లక్షలు దాటితే 5 శ్లాబుల్లో పన్ను
0-3 లక్షల వరకు నిల్
3-6 లక్షల వరకు 5% పన్ను
6-9 లక్షల వరకు 10% పన్ను
9-12 లక్షల వరకు 15% పన్ను
12-15 లక్షల వరకు 20% పన్ను
15 లక్షలు ఆదాయం దాటితే 30% పన్ను
2030 నాటికి 5 టన్నలు గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ఉత్పత్తి
దేఖో అప్నా దేశ్ పేరుతో పర్యాటక అభివృద్ధి
ఎంఎస్‌ఎంఈల రుణాల వడ్డీ రేటు ఒక శాతం తగ్గింపు
మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ కింద 2 లక్షల సేవింగ్స్‌పై 7% వడ్డీ ..
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ పరిమితి 15 లక్షల నుంచి 30 లక్షలకు పెంపు
సేవింగ్ అకౌంట్ పరిమితి 4.5 లక్షల నుంచి 9 లక్షలకు పెంపు
ఈ ఏడాదికి సవరించిన ద్రవ్యలోటు 6.4 శాతం
భారత్‌లో తయారైన ఫోన్ల విలువ 2.75 లక్షల కోట్లు
లిథియం బ్యాటరీలపై కస్టమ్ డ్యూటీ 21% నుంచి 13 % తగ్గింపు
తగ్గనున్న టీవీలు, ఎలక్ర్టానిక్ వస్తువుల ధరలు
టీవీ ప్యానల్స్‌పై కస్టమ్ డ్యూటీ 2.5 శాతం తగ్గింపు
రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే వడ్డీ రహిత రుణ సదుపాయం మరో ఏడాది పాటు పొడిగింపు
మరిన్ని ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ, దేశవ్యాప్తంగా చిన్న పట్టణాల్లో 50 కొత్త ఎయిర్‌పోర్టులు, హెలీ ప్యాడ్లు
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కోసం 19,700 కోట్లు
మత్స్యశాఖకు 6 వేల కోట్ల నిధులు
రైల్వేలకు 2.40 లక్షల కోట్లు కేటాయింపు
50 ఎయిర్‌పోర్ట్‌లు, పోర్టుల పునరుద్ధరణ
నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి 10 వేల కోట్ల అర్బన్ ఇన్‌ఫ్రా ఫండ్
ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం 38 వేల కోట్లు
50 ఏళ్ల పాటు రాష్ట్రాలకు ఇచ్చే వడ్డీలేని రుణాలు కొనసాగింపు
భారత తలసరి ఆదాయం 2.97 లక్షలు
కర్ణాటకలోని కరువు ప్రాంతాల అభివృద్ధికి 5300 కోట్ల కేంద్ర సాయం
ఏకలవ్య స్కూల్స్‌లో 38,800 టీచర్ల నియామకం
740 ఏకలవ్య స్కూల్స్ ఏర్పాటు, 3.50 లక్షల మంది విద్యార్థులకు బోధన
ప్రధాని ఆవాస్ యోజన కింద 79 వేల కోట్లతో దేశ వ్యాప్తంగా బడుగులకు ఇళ్ల నిర్మాణం

