బీఎస్‌ఎఫ్ కాల్పులు.. ఏడుగురు చొరబాటుదారులు హతం..!
జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బీఎస్ ఎఫ్ తిప్పి కొట్టింది. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ పరిణామాలు జరగడం గమనార్హం. మే 8వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో సాంబ సెక్టార్‌లో కొందరు ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి చొరబాటుకు ప్రయత్నించారు. దీన్ని బీఎస్ఎఫ్ భగ్నం చేసింది. ఈక్రమంలో బీఎస్‌ఎఫ్ జరిపిన కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరి కదలికలను భారత నిఘావ్యవస్థ కనిపెట్టింది. పాక్ తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయి. రాజస్థాన్ లో 1037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు.

