BRS పార్టీ అన్నిరంగాల్ని దోపిడీ చేసింది-విజయశాంతి
అయిజ: రాష్ట్రంలోని అన్ని రంగాల్లో దొర దోపిడీ చేశారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్ పర్సన్, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఆరోపించారు. బుధవారం అయిజలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలంపూర్ పార్టీ అభ్యర్థి సంపత్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా గర్జనలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణ కోసం ప్రజలు దండయాత్ర చేస్తే.. ఇప్పుడు అదే ప్రజలపై దొర కేసీఆర్ దండయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. దొరను గద్దె దింపేంతవరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదన్నారు. జీఓ 317 ద్వారా భార్యభర్తలను విడదీశారని ఆరోపించారు. ప్రజలు త్వరలోనే కేసీఆర్‌ను ఇంటికి పంపడం ఖాయమన్నారు. బీఆర్ఎస్‌కు 20 సీట్లు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే స్వచ్ఛమైన పాలన అందిస్తామని అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్‌కుమార్ పేర్కొన్నారు.

