Home Page SliderTelangana

బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన

తెలంగాణ శాసన సభ, మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. మండలి ప్రారంభమైన కాసేపటికే శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనకు దిగారు. ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో క్వింటాల్ పసుపుకు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలని.. పసుపు రైతులను వెంటనే ఆదుకోవాలని అంటూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శాసన మండలి మీడియా పాయింట్ వద్ద మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి మాట్లాడుతూ.. కేంద్రం పసుపు బోర్డు ప్రకటించింది కానీ, చట్టబద్దత కల్పించలేదని విమర్శలు గుప్పించారు. నామామాత్రపు ప్రకటన చేసింది. తక్షణమే పసుపు బోర్డుకు కేంద్రం చట్టబద్దత కల్పించాలని మధుసూడనా చారి డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రైతుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని మధుసూదనా చారి వెల్లడించారు.