కవితకు ఏం కొంపలు అంటుకుపోయాయి.. ఇంత ఆవేశం ఎందుకు..?
కవితకు ఇంత ఆవేశం ఎందుకు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్ రావు అన్నారు. కవిత చిట్ చాట్ పై రవీందర్ రావు స్పందించా రు. కవిత మాట్లాడిన మాటలు క్షమించరానివన్నారు. ఆమె వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయన్నారు. లేఖలోని అంశాలు బయటకు వచ్చిన తరవాత కేసీఆర్ సమాధానం ఇచ్చే వరకు వేచి చూడాలి కదా. ఆయన స్పందించిన తరవాత మాట్లాడాలని చెప్పారు. కవితకు కొంచెం అయినా ఓపిక ఉండాలి కదా. కేసీఆర్ మీకే కాదు లక్షలాది మంది ప్రజలకు దేవుడు. ఆయనను నోటీసులతో కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వేధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏం కొంపలు అంటుకుపోయాయి. లేఖలోని అంశాల గురించి కేసీఆర్ చూసుకుంటారని.. ఆయన ఆదేశాలు ఇచ్చేంతవరకు ఎందుకు ఆగడంలేదు. ఇప్పుడు దేవుడి మీదనే దండెత్తుతావా?’ అని రవీందర్ రావు మండిపడ్డారు.

