బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతి
బీఆర్ఎస్ నేత, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో మృతిచెందారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1994 నుంచి 2009 మధ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు సభ్యునిగా కూడా ఎన్నికయ్యాడు. 2014లో, TRS, కాంగ్రెస్ రెండింటినీ ఓడించారు. 2009 ఎన్నికలలో ఓడిపోయిన అదే నియోజకవర్గంలో TDP పార్టీ తరపున ఎమ్మెల్యే గెలుపొందాడు. 2014 తర్వాత, టీఆర్‌ఎస్, ప్రస్తుతం BRS లో చేరాడు.