బీఆర్‌ఎస్ నేత హెచ్చరికలు
మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెయ్యే పల్లా రాజేశ్వర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులపై మండి పడ్డారు. ఇలాంటి వాటికి భయపడేది లేదన్నారు. వచ్చేది మా ప్రభుత్వమేననిధీమా వ్యక్తం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు తీరు సరిగా లేదని, మాజీ మంత్రులు, నేతలు ఆయనను కలవడానికి వెళ్లామని, కానీ పోలీసులు తమను కూడా అరెస్టు చేశారన్నారు. తనతో పాటు కొందరు బీఆర్‌ఎస్ నేతలను అరెస్టు చేసి, ఊరంతా తిప్పారని మండిపడ్డారు. చట్టాలు ఉల్లంఘించారని, రేపు మళ్లీ రాబోయే ప్రభుత్వం మాదే, జాగ్రత్త అంటూ పోలీసులను హెచ్చరించారు. మీ అక్రమాలు సహించం అన్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా బీఆర్‌ఎస్ శ్రేణులు చేరుకోవడంతో అర్థరాత్రి ఆయనను విడుదల చేశారు.

